జగన్! నీకు సిగ్గులేకపోయినా మాకుంది.. కేసీఆర్ కాళ్ల దగ్గరే ఉండి ఊడిగం చేసుకో!: కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు ఆగ్రహం

26-03-2019 Tue 22:49 | Andhra
  • కేసీఆర్ ను ప్రశ్నించకుండా కాళ్లమీదపడ్డాడు
  • ప్రత్యేకహోదా కోసం కాదు ప్రత్యేక సాయం కోసం!
  • జగన్, కేసీఆర్ లపై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం
కర్నూలు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఓవైపు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మూసివేయాలని, ముచ్చుమర్రి మూసేయాలని అంటాడని, ట్రైబ్యునల్ కూడా వేస్తాడని, అలాంటప్పుడు ఆంధ్రుడైన జగన్ ఏం చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రశ్నించాల్సింది పోయి ఆయన కాళ్ల దగ్గర ఊడిగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కాల్మొక్తా బాంచన్ అంటూ కాళ్లమీద పడ్డాడని ఎద్దేవా చేశారు.

"ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ కు మద్దతు ఇస్తానని జగన్ అంటాడు. అది ప్రత్యేక హోదా కోసం కాదు, ప్రత్యేక సాయం కోసం. కేసీఆర్ ఇచ్చే వెయ్యో, రెండువేల కోట్ల కోసమో కక్కుర్తిపడ్డాడు. ఈయన జీవితం అవినీతిమయం. ఈయన జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది. అందుకే బాంచన్ నీ కాల్మొక్తా అంటూ కేసీఆర్ కాళ్ల దగ్గర పడున్నాడు. నువ్వలాగే పడుండు! ఊడిగం చెయ్! మాకేం అభ్యంతరంలేదు. కానీ మా హక్కులకు అడ్డుపడితే మాత్రం వదిలిపెట్టేదిలేదు. ఖబడ్దార్ జగన్ మోహన్ రెడ్డీ! నీకు సిగ్గులేకపోయినా మాకుంది" అంటూ విరుచుకుపడ్డారు.

అంతేకాదు, కేసీఆర్ పైనా ఓ స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల సోనియా తెలంగాణ వచ్చినప్పుడు ఏపీకి ప్రత్యేకహోదాపై మాట్లాడితే కేసీఆర్ అభ్యంతరం చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇస్తే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పేచీ పెట్టాడని ఆరోపించారు. "ఆదాయం నీకే కావాలి, ప్రత్యేక హోదా కూడా కావాలి. మేం సంపాదించిందంతా నువ్వే తీసుకున్నావు. మమ్మల్ని అడుగడుగునా అవమానిస్తావా? మేం వెళితే ఆంధ్రావాళ్ల పెత్తనం అంటావా? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా? నువ్వు ఒక్కటిస్తే నేను 100 గిఫ్టులిస్తా" అంటూ మండిపడ్డారు.

ఇక ప్రత్యేక కోడికత్తి అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్లకు ఈయన సపోర్ట్ చేస్తాడంట! బీజేపీ వాళ్లు తప్ప దేశంలో అన్ని పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ కోడికత్తి పార్టీ ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎందుకీ దొంగమాటలు?" అంటూ ప్రశ్నించారు.
ChandrababuTelugudesamJaganKCR

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more